ఉప్పల్, అక్టోబర్ 11: హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా గొరిగె మల్లేశ్ కురుమ మూడోసారి నియమితులయ్యారు. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియామకమయ్యారు. హైదరాబాద్ ఉప్పల్‌కు చెంది న మల్లేశ్ కురుమ సేవలను గుర్తించిన ప్రభుత్వం మూడోసారి ఏజీపీగా నియమించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ఉద్యమం, నిరహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మల్లేశ్‌ను గుర్తించి, 2014లో ఏజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈసందర్భంగా మల్లేశ్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.