జగిత్యాల, అక్టోబర్ 29: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన గాజుల శ్రీనివాస్ గల్ఫ్‌లో చిక్కుకున్నాడు. గ్రామానికి చెంది న గాజుల శ్రీనివాస్ ఆజాద్ వీసాపై 2017లోని రియాద్‌కు వెళ్లాడు. కొద్దిరోజులు అక్కడ పని చేసిన తర్వాత అక్కడి యజమాని అతడిపై 12వేల సౌదీ రియాళ్లు(రూ.2.80లక్షలు) దొంగతనం (మత్లూబ్) చేశాడంటూ కేసు పెట్టాడు.
దీంతో ఎనిమిదేండ్ల నుంచి శ్రీనివాస్ జైలులోనే ఉన్నాడు. బీపీ, నరాల సమస్యతో బాధపడుతున్న శ్రీనివాస్‌ను సౌదీ నుంచి ఇండియాకు తీసుకురావాలని అతడి కుమారుడు గాజుల సాయికిరణ్ మంగళవారం హైదరాబాద్ సీఎం ప్రవాసీ ప్రజావాణి సీఎం పేరిట వినతిపత్రం సమర్పించారు. మత్లూబ్ కేసు తొలగించేందుకు సహకరించాలని రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి ఇదివరకే రెండుసార్లు విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.