పెద్దేముల్, అక్టోబర్ 17: కాంగ్రెస్కు షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల జడ్పీటీసీ ధారాసింగ్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకొంటూ 35 ఏండ్లుగా పనిచేసిన ధారాసింగ్ను అధిష్ఠానం సమాచారం ఇవ్వకుండా పీసీసీ డెలిగేట్ పదవి నుంచి తొలగించటం అన్యాయమని పేర్కొన్నారు. ఆ పదవిని రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన వారికి కట్టబెట్టడంతో ఆయన మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కాంగ్రెస్ మండల నాయకులు చెప్తున్నారు. ఇదే విషయమై ఆయన ఫోన్లో సంప్రదించటానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.