ఫైనల్లో జ్వెరెవ్.. సెమీస్‌లో మెన్సెక్పై విజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జ్వెరెవ్ 7-5, 6-2, 3-6, 6-3తో యాకుబ్ మెన్సెక్(చెక్ రిపబ్లిక్)పై అద్భుత విజయం సాధించాడు. మూడు గంటల పాటు సాగిన పోరులో జ్వెరెవ్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జ్వెరెవ్ 7-5, 6-2, 3-6, 6-3తో యాకుబ్ మెన్సెక్(చెక్ రిపబ్లిక్)పై అద్భుత విజయం సాధించాడు. మూడు గంటల పాటు సాగిన పోరులో జ్వెరెవ్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. టోర్నీలో నిలకడగా ఆడుతున్న ఈ జర్మన్ ప్లేయర్..సెట్ సెట్‌కు తన ఆటతీరును మెరుగుపర్చుకుంటూ తుదిపోరుకు అర్హత దక్కించుకున్నాడు. తొలి సెట్ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఓవైపు జ్వెరెవ్ పదునైన సర్వ్‌లతో చెలరేగితే మరోవైపు 18 ఏండ్ల యాకుబ్ అంతే దీటుగా బదులిచ్చాడు. దీంతో ఓ దశలో 5-5తో సెట్ సమమైన సమయంలో మెన్సెక్ అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నాడు. మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడంలో మెన్సెక్ విఫలం కావడం, అదే సమయంలో జ్వెరెవ్ ఒత్తిడిని అధిగమిస్తూ 7-5తో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండో సెట్లో ఏ మాత్రం వెనుకకు తగ్గని జ్వెరెవ్.. దాన్నీ దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్లో ఒక్కసారిగా పుంజుకున్న మెన్సెక్.. జ్వెరెవ్‌కు ఝలక్ ఇచ్చాడు. తన శక్తినంతా కూడదీసుకుంటూ జ్వెరెవ్‌కు చెమటలు పట్టించిన మెన్సెక్ 6-3తో సెట్ కైవసం చేసుకోవడం పోరు ఆసక్తికరంగా మారింది. పోటీ తీవ్రతను గమనించిన జ్వెరెవ్.. 2-0తో ఆధిక్యం కనబరిచి అదే దూకుడు కనబరుస్తూ 3-0, 4-2తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు. మ్యాచ్‌లో జ్వెరెవ్ 8 ఏస్‌లు సంధిస్తే మెన్సెక్ నాలుగుకు పరిమితమయ్యాడు. ఐదు సార్లు డబుల్‌ఫాల్ట్స్ చేయడం మెన్సెక్ కొంపముంచగా, జ్వెరెవ్ రెండుతో సరిపెట్టుకున్నాడు. 7 బ్రేక్ పాయింట్లలో జ్వెరెవ్ 4 కాపాడుకుంటే మెన్సెక్కు 4లో ఒకటే దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

