హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): భవిష్యత్ అంతా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదేనని.. ఆ దిశగా యువత దృష్టి సా రించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.. ఈ పరిశ్రమలు ఏర్పాటుచే సే వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆగ్రోస్ సంస్థ ఆధ్వర్యం లో రైతు సేవాకేంద్రాల నిర్వహకులకు మేనేజ్ సంస్థ సహకారంతో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని బుధవా రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటైన పరిశ్రమల ద్వారా. సుమా రు 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని తెలిపారు. రైతు సేవాకేంద్రాలు రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని.. ఎరువులు, విత్తనాలు విక్రయించడమే కాకుండా ఆధునిక పద్ధతులు, సాంకేతిక వినియోగం, యంత్రాల వినియోగం, కొత్త పంట ల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి 36శాతం సబ్సిడీతో సుమారు 25 లక్షల వరకు బ్యాంకు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీటితో రైతు సేవా కేంద్రాలను రైతులకు ఉపయోపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండీ రాములు, మేనేజ్ డీజీ చంద్రశేఖర్, నాబార్డ్, ఇతర బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.