Gone Prakash Rao | కరీంనగర్ : తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రకాశ్ రావు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటానని ప్రకటించిన క్రమంలో ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ చందర్‌ను గెలిపించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.