మహదేవపూర్,జూన్ 9: మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్ పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ డిమాండ్ చేశారు. బరాజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మేడిగడ్డ బరాజ్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పర్యాటకులకు మార్గదర్శకాలు సూచించే వారిని నియమించి ప్రమాదాలను అరికట్టాలని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. గాయపడిన వారికి నోటీసులు జారీ
Green Almonds | ఎండిన బాదం మాత్రమే కాదు.. పచ్చి బాదం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది..!
Rain Update | రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు.. మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు