Green Almonds | ఎండిన బాదం మాత్రమే కాదు.. పచ్చి బాదం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది..!
బాదంపప్పును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీన్ని పోషకాహార నిపుణులు సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు.
Green Almonds | బాదంపప్పును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీన్ని పోషకాహార నిపుణులు సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. బాదంపప్పును రోజుకు 7 లేదా 8 మోతాదులో తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ పప్పులను బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాలని చెబుతుంటారు. అయితే బాదంకాయలు బాగా పండిన తరువాత వాటిని ఎండబెట్టి వాటిల్లో ఉండే పప్పును సేకరించి విక్రయిస్తారు. కానీ మనకు పచ్చిబాదం కాయలు కూడా లభిస్తాయి. వాటిల్లోని పప్పు అప్పుడప్పుడే తయారవుతుంది. నిజానికి ఈ పప్పును కూడా తినవచ్చు. ఇది జెల్లాగా సుతిమెత్తగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు చెందిన వారు ఎండిన బాదంకంటే పచ్చిబాదంను తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇక పచ్చి బాదం కాస్త తియ్యగా, పులుపుగా, వగరుగా ఉంటుంది. ఇది కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బాదంపప్పు కేవలం ఈ సీజన్లో మాత్రమే లభిస్తుంది.
బరువు తగ్గేందుకు..
పచ్చిబాదంలోనూ అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఎండిన బాదంకన్నా ఫైబర్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి బాదంపప్పును తింటే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. పచ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రోగ నిరోధక వ్యవస్థకు..
పచ్చి బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. పచ్చిబాదంలో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది కనుక ఇవి మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. రక్త నాళాలు వెడల్పుగా మారి రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి పచ్చిబాదం ఎంతో మేలు చేస్తుంది. దీంతోపాటు గుండె పోటు రాకుండా రక్షిస్తుంది.
చర్మం, శిరోజాల సంరక్షణకు..
పచ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి కనుక చర్మాన్ని సంరక్షిస్తాయి. ఈ బాదంతో ఫేస్ ప్యాక్ వేసుకుని ఉపయోగించవచ్చు. ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చి యవ్వనంగా ఉంచుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. పచ్చిబాదంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ బాదంలను పేస్ట్‌లా చేసి హెయిర్ ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. శిరోజాలు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పచ్చి బాదంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పచ్చిబాదంలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- green almonds
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

