హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : తిరుమల వేంకటేశ్వరస్వా మి సన్నిధిలో ఓ ఉద్యోగి బంగారాన్ని దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు ప ట్టుబడ్డాడు. టీటీడీ పరిధిలో వివిధ చోట్ల నెలకొల్పిన హుండీలను ఒకేసారి పరకామణికి తరలిస్తారు. ఇదే సమయంలో బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వంద గ్రాముల బంగారం బిసెట్ను ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించి ప ట్టుకున్నారు. వ్యర్థాలను బయటికి తీసుకెళ్లే ట్రాలీలో బంగారం బిసెట్ను తరలిస్తుండగా పట్టుకొని తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. చోరీ ఘటనపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు పొందిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. రెండురోజులపాటు నిర్వహించిన ఏకాదశి ద్వాదశి దర్శనాలు ముగియగా ఎనిమిది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం శ్రీవారిని 53,013 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, తొకిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఏడుగురు బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారాన్ని అందజేశారు.