శంషాబాద్ రూరల్, జూలై 10: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం, విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.84.8 లక్షల విలువైన 1,399 గ్రాముల బంగారం, జెడ్డా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రూ.31.8 లక్షల విలువైన 526 గ్రాముల బంగారం స్వా ధీనం చేసుకొన్నారు. బ్యాంకాంక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.62,400 విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.కాగా నిందితులకు ఎయిర్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టు తెలిసింది.