దుండిగల్, జనవరి 22: దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని వీఆర్ఎస్ విజ్ఞానజ్యోతి పాఠశాల విద్యార్థి ఎం ధీరజ్‌కు ఎన్సీసీ జూనియర్ నేవీ క్యాటగిరీలో ప్రధానమంత్రి బంగారు పతకం దక్కింది. ఈ మేరకు ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం సోమవారం ఢిల్లీలో ప్రకటించిందని పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరఫున నిరుడు గణతంత్ర వేడుకల్లో ధీరజ్ పాల్గొన్నాడు. మొత్తం 3 లక్షల మంది క్యాడెట్లతో పోటీపడి ఈ విజయం సాధించాడు. ఈ నెల 28న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా పతకం అందుకోనున్నాడు. ఈ సందర్భంగా ధీరజ్‌ను పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి, అధ్యాపకులు అభినందించారు.