శంషాబాద్, అక్టోబర్ 9: ఫేస్క్రీమ్గా మార్చి బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్‌కు 6ఈ 1714 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతడితోపాటు సామగ్రిని తనిఖీచేశారు. బ్యాగులో ఫేస్‌క్రీమ్ రూపంలో దాచిన 528.02 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి లభించింది. వీటి విలువ రూ. 20.44 లక్షలు ఉంటుందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.