జీఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బోర్డు స మావేశం మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బోర్డు మెంబర్ సెక్రటరీ ఇరు రాష్ర్టాలకు గురువారమే ఈ సమాచారం అందించారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బోర్డు స మావేశం మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బోర్డు మెంబర్ సెక్రటరీ ఇరు రాష్ర్టాలకు గురువారమే ఈ సమాచారం అందించారు. జీఆర్ఎంబీ 18వ బోర్డు సమావేశాన్ని ఆగస్టు 18న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఎజెండా అంశాలు పంపాలని ఇరు రాష్ర్టాలకు సూచించగా, నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలను ఏపీ పంపింది.
తెలంగా ణ ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులను పునఃసమీక్షించాలని ప్రతిపాదించింది. ఏపీ వాదనలకు అనుగుణంగానే నీటిలభ్యతపై అధ్యయనం చేసేందు కు టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని జీఆర్ఎంబీ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఆ ఎజెండా అంశాలపై తీవ్ర వివాదమే చెలరేగిన నేపథ్యంలో బోర్డు మీటింగ్ వాయిదాపడింది. తదుపరి మీటింగ్‌ను ఈ నెల 30న నిర్వహించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

