హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి(Kandakurti త్రివేణి సంగమం వద్ద గోదావరికి(Godavari) వరద(Flod) పోటెత్తుతోంది. మహారాష్ట్రలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తెలంగాణ వైపునకు కొనసాగుతోంది.
దీనికి తోడుగా మంజీరాలోను వరద ప్రవాహం పుంజుకుంటుంది. త్రివేణి సంగమం నుంచి వస్తోన్న వరద ప్రవాహం అంతర్రాష్ట్ర ఫ్లైఓవర్ వద్ద గంటగంటకు భయానకంగా కనిపిస్తోంది. గోదావరి నదిలో చారిత్రక శివాలయం మునిగి పోయింది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.