ఆలేరు, జూన్ 15: మాదిగలను విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుంచడమే లక్ష్యంగా టీఎమ్మార్పీఎస్ కృషి చేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడారు. మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమన్నారు.
మన హక్కులు, వాటా కోసం పోరాడుతూనే.. భవిష్యత్తరాలు అన్ని రంగాల్లో ముందుండేలా చూడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో జనాభా దామాషా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అట్టడుగు స్థాయిలో ఉన్న, అణగారిన వర్గాలకు చెందిన మాదిగ ఉప కులాల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు.goal of