Kaleshwaram | కాళేశ్వరం వద్ద పెరిగిన నీటి మట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Kaleshwaram | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం ఉదయం 103.550 మీటర్లుగా నమోదైంది.
Kaleshwaram | జయశంకర్ భూపాలపల్లి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం ఉదయం 103.550 మీటర్లుగా నమోదైంది. సెంట్రల్ వాటర్ కమిషన్, నీటిపారుదల శాఖ కొలతల ప్రకారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
దీంతో గోదావరి నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాలైన కుంట్లం, పాల్గుల, అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి, కాళేశ్వరం, పుస్కుపల్లి, మాజీద్ పల్లి, మెట్ పల్లి, బీరసాగర్, పెద్దంపేట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాలని ఆదేశించారు.
భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది. సోమవారం నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
KCR | తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి..: కేసీఆర్
Congress | కాంగ్రెస్ సర్కారుపై అసహనం.. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

