వీలైనంత త్వరలో జీవో 111 ఎత్తివేస్తాం : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 111 జీవోను ఎత్తివేయాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. ఎమ్మెల్యే యాదయ్య చెప్పినట్లు 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. గతంలో మనకు ఉన్న ట్యాంక్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గానీ అక్కడి నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు తీసుకునేది. .తగ్గిపోయింది.. కానీ ఎండాకాలంలో.. అక్కడి నుంచి నీళ్లు తీసుకునే సందర్భం ఉండే.
111 జీవోలో ఆ లేక్స్ కలుషితం కాకుండా ఉండాలంటే బ్యాన్ పెట్టాలని ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక నిర్ణయం మేరకు తీసుకున్నది. ఈ రోజు సంతోషంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్ నగరానికి ఈ రెండు ట్యాంక్స్ నీళ్లు వాడుకునే అవసరం లేదు. సమస్య పూర్తిగా సమసిపోయింది. సింగూరు నుంచి బంద్ చేశాం. గోదావరి, కృష్ణా నీళ్లు గానీ సఫిషియంట్‌గా తెస్తున్నాం. అదేవిధంగా 40టీఎంసీలు తేవడానికి సుంకిశాల నుంచి నిధులు కూడా మంజూరు చేశాం. అదేవిధంగా పనులు కూడా స్టార్టవుతున్నాయ్.
అదేవిధంగా గోదావరి జలాలు మల్లన్న సాగర్ నుంచి పుష్కలంగా గ్రావిటీ ద్వారానే హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ స్కీమ్ అండ్వేవ్లో ఉన్నది. భవిష్యత్‌లో ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. 111 జీవో అర్థ రహితం, రిడెండెంట్ కూడా అయిపోయింది. 1.32 లక్షల ఎకరాలకు సంబంధించిన జీవోను ఎత్తివేస్తే ప్రభావితం అయ్యే అవకాశం ఉంటది. చీఫ్ సెక్రెటరీకిని, హెచ్ఎండీఏను రెక్వెస్ట్ చేశాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్లను చూస్తున్నారు. అక్కడ కూడా కఠినంగా గ్రీన్ జోన్, మాస్టర్ ప్లాన్, రోడ్స్.. జీహెచ్ఎంసీ ఎలా అయితే ఉందో.. అదే పద్ధతిలో కొనసాగే విధంగా చర్యలు వీలైనంత త్వరలో జీవో 111ను ఎత్తి వేస్తాం. నిపుణుల కమిటీ నివేదిక కూడా రావాల్సి ఉంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

