e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home తెలంగాణ వైద్యరంగ ఆణిముత్యం జ్ఞానేశ్‌

వైద్యరంగ ఆణిముత్యం జ్ఞానేశ్‌

500 కుపైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలు
మారేడ్‌పల్లి, సెప్టెంబర్‌ 22: యశోద దవాఖానకు చెం దిన సీనియర్‌ హార్ట్‌, లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జ్ఞానేశ్‌ టక్కర్‌ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు 500 కుపైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది వైద్యుల్లో ఒకరుగా నిలిచా రు. ఈ నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్‌ యశోద దవాఖానలోని సహచర వైద్యులు ఆయనతో కేక్‌ కట్‌ చేయించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యశోద దవాఖాన డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ.. డాక్టర్‌ జ్ఞానేశ్‌ టక్కర్‌ సేవలను కొనియాడారు.
డాక్టర్‌ జ్ఞానేశ్‌ టక్కర్‌ ప్రస్థానం ఇదీ: తొలుత భారత్‌లో కార్డియో థొరాసిక్‌ సర్జన్‌గా పనిచేసిన డాక్టర్‌ జ్ఞానేశ్‌.. ఆ తర్వాత శిక్షణ నిమిత్తం అమెరికాకు వెళ్లారు. కాలక్రమంలో ప్రపంచంలోని పలు అగ్రశ్రేణి వైద్య కేంద్రాల్లో ప్రాక్టీస్‌ చేశారు. 3 నెలల వ్యవధిలోనే 70 కిపైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేసి తన ప్రతిభను చాటుకున్నారు. దీంతో డాక్టర్‌ జ్ఞానేశ్‌ టక్కర్‌పై ప్రముఖ మ్యాగజైన్‌ ‘టెంపుల్‌ క్యాప్సూల్‌’ తన కవర్‌ పేజీలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని ప్రముఖ వైద్య నిపుణుల్లో ఒకరిగా ఉన్న టక్కర్‌ భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత దేశంలో తొలి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చిన్న గాటుతో డబుల్‌ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను కూడా మొట్టమొదట ఆయనే చేయడం విశేషం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement