కాళేశ్వర ఘనత విశ్వవ్యాప్తం

- ‘లిఫ్టింగ్ ఏ రివర్’ అద్భుత ఆవిష్కారం
- గంటపాటు టీవీలకే అతుక్కుపోయిన జనం
- ఆద్యంతం పులకించిన యువత, అన్నదాత
- నిర్మాణ కౌశలత తెలుసుకుని సంభ్రమాశ్చర్యం
- హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ ప్రశంసల వెల్లువ
- సోషల్ మీడియా నిండా ప్రశంసల పోస్టులు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ రాజేంద్ర శ్రీవత్స రూపొందించిన ‘లిఫ్టింగ్ ఏ రివర్’ శుక్రవారం రాత్రి అంతర్జాతీయ చానల్ డిస్కవరీలో, డిస్కవరీ+ యాప్‌లో ప్రసారమైంది. సీఎం కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి ఈ డాక్యుమెంటరీ దర్పణం పట్టింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సమాజం ఆద్యంతం తిలకించి పులకించిపోయింది. దాదాపు గంటపాలు జనమంతా టీవీలకే అతుక్కుపోయారు. కార్యక్రమాన్ని తిలకిస్తూ యువత, అన్నదాత పులకించిపోయారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ కౌశలతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రాజెక్టును వీక్షించిన ప్రతిఒక్కరూ ‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్’ అంటూ ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి అంచెను, ఎదురైన సవాళ్లను, వాటిని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలను, పద్ధతులను ఈ డాక్యుమెంటరీ కండ్లకు కట్టింది. ఇంజినీరింగ్ ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాక్షాత్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును ఒక రాష్ట్రప్రభుత్వం చేపట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద 139 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను వినియోగించడాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
డిస్కవర్ ఛానల్లో ప్రసారమైన ‘లిఫ్టింగ్ ఏ రివర్’ కార్యక్రమంపై, ప్రాజెక్టు రూపకర్త సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ను అపర భగీరథుడు, తెలంగాణ కాటన్ దొర అని కొనియాడారు. ‘జై కేసీఆర్’ ‘గ్రేట్ కేసీఆర్’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాళేశ్వరం తెలంగాణ వరదాయిని అంటూ కీర్తించారు. డాక్యుమెంటరీలోని విశేషాలను ఎఫ్బీ, వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టుకొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. వీడియోలను షేర్ చేశారు.
డాక్యుమెంటరీలో చెప్పిన కొన్ని విశేషాలు
- మానవుడు, యంత్రాలు కలిసి రూపొందించిన అద్భుతం కాళేశ్వరం. ఒక నదిని అచ్చంగా ఎత్తిపోశారు.
- ఒకే ఒక నది వనరు నుంచి 169 టీఎంసీల నీటిని 37 లక్షల ఎకరాలకు చేర్చడం, అదనంగా 18.5 లక్షలను తడపడం, 30 టీఎంసీల తాగునీటిని అందించడం, 13 జిల్లాలకు ప్రయోజనం కల్పించడం, భూగర్భ జలాలను పెంచడం గొప్ప విషయం.
- కాళేశ్వరం ద్వారా ఒకరోజు ఎత్తిపోసే నీటితో ఒలింపిక్ పోటీల సైజులో ఉండే రెండు లక్షల ఈత కొలనులను (స్విమ్మింగ్ పూల్స్) నింపొచ్చు.
- ప్రాజెక్టులో భాగంగా తవ్విన కాలువలు, టన్నెళ్లను వరుసగా పేర్చితే కాళేశ్వరం నుంచి ఢిల్లీకి మధ్య ఉన్నదూరం కన్నా ఎక్కువ.
- బాహుబలి మోటర్లు జల ప్రపంచంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్లు.
- పాజెక్టులో సుమారు 10 జాతీయ, 5 అంతర్జాతీయ కంపెనీలు భాగస్వాములయ్యాయి. భిన్నమైన భాషలు, జాతీయతలు ఒకే దగ్గరకు చేరాయి. కాబట్టి ఇదో మినీ ఐక్యరాజ్యసమితిగా చెప్పొచ్చు.
- కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోసేది నీటిని కాదు.. లిక్విడ్ గోల్డ్. దీనికి రైతుల తలరాతను మార్చే శక్తి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

