హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ కార్యదర్శి గ్యాదరి బాలమల్లుకు గ్లోరీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అమెరికాకు చెందిన ఈ యూనివర్సిటీ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బాలమల్లు సామాజిక రంగంలో అందిస్తున్న సేవలకు గానూ డాక్టరేట్‌ను అందించింది. సిద్దిపేటకు చెందిన బాలమల్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ఐఐసీ చైర్మన్‌గా మూడు టర్మ్‌లు సేవలందించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందారు.