హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంట్ బదిలీల కోసం ఒకే ఇరిగేషన్ స్టేషన్లో ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను జూన్ 4లోగా పంపించాలని అన్ని యూనిట్లకు ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్టేషన్) శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. 2024 మే 31 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఏఈ, డీఈఈ, ఈఈ, ఎస్ఈ వరకు అధికారుల జాబితాను పంపాలని సూచించారు.