Sandeep Reddy Vanga | ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ఒక సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ప్రారంభంలో సముద్ర తీరం బ్యాక్‌డ్రాప్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే బైక్ రైడ్స్, రొమాంటిక్ సీన్స్ ఎంతో ఆహ్లాదకరంగా సాగగా.. అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న తరుణంలో గ్లింప్స్ ముగింపులో దర్శకుడు ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా చెంపదెబ్బలు కొట్టుకుంటూ ‘ఐ హేట్ యూ’ అని అరుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతవరకు కూల్‌గా సాగిన వాతావరణం, ఒక్కసారిగా ఇంటెన్స్ ఎమోషనల్‌గా మారిపోవడంతో ఈ ప్రేమకథలో సందీప్ రెడ్డి వంగా మార్క్ గట్టిగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇక వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.