Flash floods | జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు.. పలు ఇండ్లు, వాహనాలు ధ్వంసం
Flash floods | జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) దోడా జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు(Flash floods )బీభత్సం సృష్టించాయి.
Flash floods | జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) దోడా జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు(Flash floods )బీభత్సం సృష్టించాయి. రోడ్లు జలమయ మయ్యాయి. థాత్రి, గండోహ్, బలేస్సా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరద నీరు ఇళ్లల్లోకి చేరడం వల్ల రోడ్లు ధ్వంసమై సాధారణ జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి వాగులు పొంగిపొర్లడంతో బండరాళ్లు, శిథిలాలు కొట్టుకుపోయి అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
వరదల కారణంగా థాత్రి వద్ద దోడా-కిష్త్వార్ జాతీయ రహదారి కూడా మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. రాకపోకలకు అంతరాయం కలిగించిన రహదారులపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

