హైదరాబాద్, సెప్టెంబర్24 (నమస్తే తెలంగాణ) : మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రొసీడింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్(టీజీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ సెక్రటరీ షఫీ ఉల్లాను సొసైటీ కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రిన్సిపాళ్లు ఎదురొంటున్న సమస్యలు, మైనార్టీ గురుకుల సొసైటీ బలోపేతానికి తీసుకోవాల్సిన పలు అంశాలను సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. రీజనల్ లెవల్ కో-ఆర్డినేటర్ పోస్టులను ప్రమోషన్ పోస్టులుగా గుర్తించాలని కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా 317జీవోను అమలు చేశారని, దీంతో అనేక మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టిగారియా) వెల్లడించింది. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (గురువారం) గన్‌పార్క్ నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. టిగారియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్ బుధవారం ప్రకటనలో వెల్లడించారు.