హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మానసిక స్థితి సరిగాలేని దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగులతోపాటు వారికి వైద్యసేవలు అందిస్తున్న నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది.