Gurukula Schools | హైదరాబాద్, డిసెంబర్23 (నమస్తే తెలంగాణ): ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా 3 రోజులు క్రిస్మస్ సెలవులి వ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెలవులను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్మస్ను పురస్కరించుకుని సొసైటీలో ప్రతి సంవత్సరం 24,25,26న సెలవులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. విద్యార్థులను ఇళ్లకు పంపకపోవడంతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగుతున్నారు. తమకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, దానికి కూడా విద్యార్థులను పంపకపోతే ఎలా అని మండిపడుతున్నారు.