పటాన్చెరు, సెప్టెంబర్ 23: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య చటర్జీని ప్రపంచంలోని అత్యుత్తమమైన పత్రాలను ప్రచురించిన రెండు శాతం పరిశోధకుల్లో ఒకరిగా స్టాన్ఫోర్డ్-ఎల్వీర్ (2024) గుర్తించి రికార్డుల్లో స్థానం కల్పించింది. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఫార్మసీ, ఆరోగ్య పరిరక్షణ రంగంలో డాక్టర్ బప్పాదిత్య చూపిన గణనీయమైన ప్రభావాన్ని ప్రతిబింభిస్తోందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ శివకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వై గౌతమరావు, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు తదితరులు బప్పాదిత్యను అభినందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గురుకుల సమస్యల పరిషారానికి 28న చలో హైదరాబాద్‌ను నిర్వహించనున్నామని టీఎస్ యూటీఎఫ్, గురుకుల సంఘాల నేతలు వెల్లడించారు. సోమవారం మహాధర్నా పోస్టర్‌ను ఆవిషరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ 25 సమస్యలతో చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపొందించి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించామని, ఎలాంటి స్పందన లేకుండా పోయిందని వాపోయారు.