హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్-25 ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఇటీవలే తుది కీ ని విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి తాజాగా ఫలితాలు ప్రకటించింది. మహిళలు 93.49%, పురుషులు 91.61% మంది క్వాలిఫై అయ్యారు.
12,511 మంది మహిళలకు 11,697 మంది, 10,472 మంది పురుషులకు 9,593 మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pgecet.ac.in, లేదా results.tsche.ac.in ద్వారా తమ వ్యక్తిగత స్కోర్, ర్యాంకులను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. సంబంధిత లింక్లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్చేస్తే ర్యాంక్ కార్డు పొందవచ్చని వెల్లడించారు.