కేసు పెడుతరా? మోదీ సభలో చావమంటరా?
బండి సాయి భగీరథ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో అ మ్మాయి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులో పేర్కొ న్న పలు అంశాలు నివ్వెర పరిచేలా ఉన్నాయి. మైనర్ బాలికను లొంగదీసుకోవడానికి ఆడిన డ్రామాలు, చేసిన బ్లాక్‌మెయిలింగ్, పెట్టిన మెసేజ్‌ల వంటి అన్ని ఆధారాలను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించినట్లుగా అత్యంత విశ్వసనీయం గా తెలిసింది.
- పోలీసుల ఎదుట బాలిక తల్లిదండ్రుల తీవ్ర ఆక్రోశం
- కేసు తీసుకోకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు?
- నిరుడు జూన్‌లో స్నేహం, పెండ్లి పేరిట నమ్మకద్రోహం
- బాధితుల కేసు నమోదు చేయకుండా పోలీసుల జాప్యం
- కేసుల దాకా వెళ్లొద్దంటూ పలుమార్లు బెదిరింపులు
- అన్ని ఆధారాలతో పోలీసు స్టేషన్‌కు తల్లిదండ్రులు
- అయినా పట్టించుకోని పేట్ బషీరాబాద్ పోలీసులు..
- చివరికి మోదీ సభలో ఆత్మాహుతికి సిద్ధమైన కుటుంబం
- ఇక తప్పదని పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో/కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బండి సాయి భగీరథ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో అ మ్మాయి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులో పేర్కొ న్న పలు అంశాలు నివ్వెర పరిచేలా ఉన్నాయి. మైనర్ బాలికను లొంగదీసుకోవడానికి ఆడిన డ్రామాలు, చేసిన బ్లాక్‌మెయిలింగ్, పెట్టిన మెసేజ్‌ల వంటి అన్ని ఆధారాలను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించినట్లుగా అత్యంత విశ్వసనీయం గా తెలిసింది. అయితే వీరిద్దరి మధ్య పరిచయం 2025 జూన్‌లో మొదలైనట్టు తెలుస్తుండగా, ఆ తర్వాత జరిగిన సంఘటనలను గమనించి తల్లిదండ్రులు న్యాయం కోసం మూడు నెలలుగా పోరాటం చేస్తున్నట్టు తెలిసింది.
ఈ విషయం తెలుకున్న బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులు, బీజేపీలో చేరిన ఓ జర్నలిస్టుతో పాటు మరో చానల్ జర్నలిస్టులను రంగంలోకి దింపి రా జీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారని అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. రాజీకి తల్లితండ్రులు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగిన బండి కుటుంబానికి రాష్ట్రంలోని పోలీసు శాఖలో పనిచేసే ఓ పెద్ద స్థాయి (రిటైర్డ్) అధికారి వంత పాడారని తెలుస్తున్నది. దీంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టారని సమాచారం. ఈ నెల 8న అన్ని ఆధారాలు సమర్పించినా కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకా ముందు కాగా, ఆదివారం జరిగే మోదీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామని తల్లిదండ్రులు ఘాటుగా హెచ్చరించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
ఆధారాలతో ఫిర్యాదు
బాలికను పెండ్లి చేసుకుంటామని మాయ మాటలు చెప్పి నమ్మించి, ఆ తర్వాత అనేక రకాలుగా మానసికంగా భగీరథ్ హింసించాడని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 31 రాత్రి జరిగిన అనేక అంశాలను ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. వేధింపులు భరించలేక అమ్మాయి గత జనవరి 19, 26 తేదీల్లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో వెల్లడించారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలతో గత మార్చి నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఉపసంహరించుకోవాలని ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగారని, గత ఏప్రిల్‌లో అమ్మాయిపై నిర్మల్ ఠాణాలో తప్పుడు కేసు పెట్టించే ప్రయత్నం చేశారని, గతంలో పనిచేసిన ఓ జర్నలిస్టు తమ నివాసానికి ఏప్రిల్ 22న వచ్చి మాట్లాడారని, 23న బండి సంజయ్‌తో తమ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, రాజీ పడాలని పరోక్షంగా ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి సాయి భగీరథ్ చేసిన అనేక అకృత్యాలు, మానసిక హింసకు సంబంధించి ఆధారాలతో ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది.
మోదీ సభలో తేల్చుకుంటం
మూడు నెలలుగా పోలీస్‌లు తమ కేసును తీసుకోకుండా ఇబ్బందులు పెట్టడంతో విసిగిపోయిన బాధిత కుటుంబా చివరికి మోదీ సభలోనే తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమైనట్టు సమాచారం. చివరికి చేసేదేం లేక పోలీసులు బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, పోక్సో కేసు పెట్టారని తెలిసింది. నిజానికి బాలిక తల్లిదండ్రులు బండి సాయి భగీరథ్‌పై కేసు నమోదు చేయించడానికి మూడు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. రాష్ట స్థాయిలో పోలీసు విభాగంలో పనిచేసే ఓ అధికారి ఈ కేసు ఫైల్ కాకుండా అడ్డుపడ్డారని తెలిసింది. తన పదవిలో కంటిన్యూగా కొనసాగేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సాయం కోసం ఆయన బండిసాయి భగీరథ్‌పై కేసు కాకుండా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
పోలీసుల వ్యవహారంతో విసిగి వేసారిన తల్లిదండ్రులు ఈనెల 8న తాడోపేడో తేల్చుకునేందుకు స్టేషన్‌కు వెళ్లినట్టు సమాచారం. దాదాపు ఆరు గంటల పాటు అక్కడే నిరీక్షించినా పట్టించుకోకపోవడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, కేసు నమోదు చేయకపోతే ఆదివారం జరిగే మోదీ సభలోనే తేల్చుకుంటామని, తమ కూతురుకు న్యాయం జరగకపోతే అక్కడే సూసైడ్ చేసుకుంటామని తెగేసి చెప్పడంతో కేసు నమోదు చేయక తప్పదని భావించిన పోలీసులు, అక్కడ జరిగిన ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పడు బండి భగీరథ్ కుటుంబ సభ్యులకు చేరవేశారని తెలిసింది. ఈ క్రమంలోనే బండి భగీరథ్ హడావుడిగా కరీంనగర్ రెండో ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

