పెద్దపల్లి టౌన్, జూన్ 1: ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్‌బాటిల్ తీస్తుండగా పాము కాటేయడంతో ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పెద్దపల్లి జిల్లా సు ల్తానాబాద్కు చెందిన నిట్టూరు సంతోష్-లత దంపతులకు కూతురు వైష్ణవి (12), కొడుకు సాకేత్ ఉన్నారు. కొన్నేండ్ల క్రితమే భర్త సంతోష్ మరణించగా లత తన కొడు కు, కూతురుతో కలిసి పుట్టింట్లో జీవిస్తు న్నది. శుక్రవారం సాయంత్రం 6 గంటల కు వైష్ణవి తమ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటున్న సమయం లో అప్పటికే ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము కాటే సింది. ఎలుక కొరికిందనుకొని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత వైష్ణవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.