వెంకన్నకు సిరిసిల్ల పసిడి వస్ర్తాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి అద్భుత ప్రతిభ చాటారు. 5 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర, పట్టువస్ర్తాలు తయారు చేశారు.
- 5 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడే చీర
- పద్మావతి అమ్మవారికి బంగారు చీర బహూకరణ
- సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అద్భుత ప్రతిభ
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 9: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి అద్భుత ప్రతిభ చాటారు. 5 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర, పట్టువస్ర్తాలు తయారు చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి బంగారు పట్టువస్ర్తాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను బహూకరించారు.
ఆదివారం తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ జవహర్‌రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వాటిని అందజేశారు. స్వామివారికి రూ.45 వేల విలువ చేసే బంగారు ధోతితోపాటు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఝరీ చీరను అందజేసినట్టు విజయ్ తెలిపారు. శ్రీవారికి ధోతీ, పద్మావతి అమ్మవారికి చీరను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని విజయ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

