ఆస్ట్రేలియాకు తాండూర్ కందులు
భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూర్ కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ) : భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూర్ కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ(అపెడా) సహకారంతో ఈ ఎగుమతి సాధ్యమైంది. తొలి సరుకును బుధవారం హైదరాబాద్ నుంచి హైబ్రిడ్ విధానంలో జెండా ఊపి వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ప్రారంభించారు.
హైదరాబాద్ అపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు వర్చువల్ విధానంలో సరుకును ప్రారంభించారు. ఈ సరుకులో 2.5 టన్నుల జీఐ ట్యాగ్ తాండూర్ కందులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ దుర్గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ ‘అమ్మాస్’ (ఏఎంఎంఏఏఎస్) బ్రాండ్ పేరుతో వీటిని ఎగుమతి చేస్తున్నది. సముద్ర మార్గంలో రవాణా అయ్యే ఈ సరుకును ఆస్ట్రేలియాలోని ఎంఎస్ భారతమ్మ పీటీవై లిమిటెడ్ సంస్థ దిగుమతి చేసుకుంటుంది. అపెడాలో నమోదైన ఈ సంస్థ తెలంగాణ నుంచి బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కిరాణా సరుకులను ఎగుమతి చేస్తున్నది.
తెలంగాణకు గర్వకారణం.. తాండూర్ కందులు
తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన మొట్టమొదటి వ్యవసాయ ఉత్పత్తి తాండూర్ కందులే. తాండూర్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లోని వర్షాధార భూము ల్లో ప్రధానంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని సారవంతమైన లోతైన నల్లరేగడి నేలలు, బంకమట్టి ఖనిజ నిక్షేపాలు, విస్తారమైన సున్నపురాయి నిక్షేపాల వల్లే తాండూర్ కందులకు ప్రత్యేక లక్షణాలు వచ్చాయి. తాండూర్ కందుల్లో 22 నుంచి 24% మాంసకృత్తులు(ప్రొటీన్) ఉంటాయి. ఇది ధాన్యాల్లోని ప్రొటీన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎకువ. రుచి, వంటకు అనుకూలత, ఎకువ కాలం నిల్వ ఉండే గుణం వీటి ప్రత్యేకత. జీఐ గుర్తింపు వల్ల ఈ ఉత్పత్తికి మరింత ప్రాచుర్యం, మారెట్లో గుర్తింపు లభించడంతోపాటు దేశ, విదేశీ మారెట్లలో అధిక విలువ పొందే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

