ఘట్కేసర్, అక్టోబర్25: ఘట్కేసర్ మున్సిపాలిటీ ఇన్చార్జి ఏఈ రాజశేఖర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల జరిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు.
ఇందుకు కోసం క్రేన్లను ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ బిల్లు పాస్ చేయాలని కోరగా రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సన్ని రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో సదురు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రాజశేఖర్‌కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సన్నికి ఫోన్‌పేలో రూ.30వేలు చెల్లించినట్టు కాంట్రాక్టరు చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.