హైదరాబాద్: జిమ్‌లో కసరత్తు చేస్తూ గాయపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆకాంక్షించారు. బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా, జగన్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. Thank you Anna అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025
Thank you Anna https://t.co/YQObLClBAx
— KTR (@KTRBRS) April 29, 2025
జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డానని సోమవారం సాయంత్రం కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో స్వల్పంగా గాయమైందని తెలిపారు. డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, ఆయన త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆకాంక్షించారు. కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సోషల్ మీడియాలో వేలమంది నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సాధ్యమైనంత తొందరలో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు.
Thank you Sanjay Garu https://t.co/dG0erwek2K
— KTR (@KTRBRS) April 28, 2025
Thank you @PawanKalyan Garu https://t.co/Ktea3yxbRF
— KTR (@KTRBRS) April 28, 2025