హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)కు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతల నుంచి టీజీ జెన్కో తప్పుకుంటున్నది. రెండో విడతలో నిర్మించిన ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఇతరులకు అప్పగించనున్నది. ఇటీవల నిర్వహించిన తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ (టీజీపీసీసీ) సమావే శం ఇందుకు ఆమోదం తెలిపింది. అయితే, తొలుత టీజీజెన్కో ఎలాంటి ప్రతిపాదనలూ సమర్పించకపోయినప్పటికీ, అకస్మాత్తుగా సర్కార్ పెద్దలు కల్పించుకుని ఈ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చి ఆమోదించిన ట్టు తెలుస్తున్నది. ఈ ప్లాంట్ ఓఅండ్ఎం బాధ్యతలను ప్రైవేట్‌కు లేదా.. బీహెచ్ఈఎల్కు అప్పగించే అవకాశా లు ఉన్నట్టు సమాచారం.
ఓ ప్రైవేట్ సంస్థ ఈ ప్లాంట్ ఓఅండ్ఎం పనులను కైవసం చేసుకునేందుకు శతవిధా లా ప్రయత్నిస్తున్నట్టు విద్యుత్తుసౌధ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే, బీహెచ్ఈఎల్కు ఇస్తారని కొం దరు ఇంజినీర్లు చెప్తున్నారు. బీహెచ్ఈఎల్కు ఇచ్చినట్టు ఇచ్చి, అనంతరం ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన మినట్స్ బయటికి పొక్కకుండా సర్కార్ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైటీపీఎస్ ఓఅండ్ఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న జెన్కో నిర్ణయాన్ని విద్యు త్తు ఉద్యోగ, ఇంజినీర్ల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇంజినీర్లు ఉండగా..
వైటీపీఎస్ను మొత్తం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. మొదటి దశలో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లు, సెకండ్ స్టేజ్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లున్నాయి. ఫస్ట్ స్టేజ్‌లోని రెండు యూనిట్లల్లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. రెండో స్టేజ్‌లో యూనిట్-4 కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన రెండు యూనిట్లు సైతం అందుబాటులోకి రావాల్సి ఉన్నది. అయితే రామగుండం, విద్యుత్తుసౌధ, భద్రాద్రి ప్లాంట్ నుంచి కొందరిని బదిలీచేసి వైటీపీఎస్‌లో పోస్టింగ్ ఇచ్చారు.
కానీ, ఈ ప్లాంట్ల అవసరాలు తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జెన్కో కొత్త ఇంజినీర్లను రిక్రూట్చేయాల్సి ఉండగా, ఇంతవరకు రిక్రూట్చేయలేదు. వైటీపీఎస్ రెండో విడత ఓఅండ్ఎం బాధ్యతలను ఇతరులకు అప్పగించడాన్ని ఒప్పుకోబోమని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు సాయిబాబు, రత్నాకర్రా వు, బీసీరెడ్డి, సదానందం అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంట్లను టీజీ జెన్కో ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జెన్ కో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ప్రైవేట్‌కు అప్పగిస్తే నష్టమేమిటి?