జెన్కో హెచ్ఆర్ ఉద్యోగోన్నతుల్లో వివక్ష
టీజీ జెన్కోలో పనిచేస్తున్న హెచ్ఆర్ విభాగం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఉద్యోగులు ఆవేదన వ్య క్తంచేస్తున్నారు.
- అధికారులు న్యాయం చేయాలంటూ వేడుకోలు
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): టీజీ జెన్కోలో పనిచేస్తున్న హెచ్ఆర్ విభాగం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఉద్యోగులు ఆవేదన వ్య క్తంచేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల వ్యవహారాలు చూసేందు కు పీఅండ్‌జీ విభాగాలున్నాయి. జెన్కోలో మాత్రం పీఅండ్‌జీ విభాగంతోపాటు, హెచ్ఆర్ సర్వీస్ రెండు విభాగాలున్నాయి. పీఅండ్‌జీ, హెచ్ఆర్ విభాగాలు రెండూ ఒకే తరహా వృత్తికి సంబంధించినవి. అయితే ఉద్యోగోన్నతుల చానల్ మాత్రం వేరుగా ఉన్నది. 2018లో మాత్రమే 21మందిని హెచ్ఆర్ సర్వీస్‌లో రిక్రూట్ చేశారు. కొంతకాలం క్రితం హెచ్ఆర్ విభాగం వారికి ఉద్యోగోన్నతులు ఇచ్చారు. అయితే హైదరాబాద్‌లో పనిచేస్తున్న వీరికి ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఇతర సర్వీస్‌లోని కొందరు ఉద్యోగులకు ఇన్చార్జి ప్రమోషన్లు ఇచ్చినా పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు. వారికో న్యాయం.. మాకో న్యాయమా? ఒకే సంస్థలో రెండు రకాల రూల్స్ ఉంటాయా? అంటూ హెచ్ఆర్ విభాగం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
అటవీశాఖలో అంతర్గత బదిలీలు రద్దు ; కొత్త పీసీసీఎఫ్ సంచలన నిర్ణయం డిప్యూటేషన్‌పై వెళ్లిన వారికి మినహాయింపు
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో ఇటీవల జరిగిన అంతర్గత బదిలీలు రద్దు చేస్తూ కొత్త పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ సర్క్యూలర్ జారీచేశారు. పాత బ దిలీలు రద్దు చేస్తూ ఉత్తర్వుల జారీతో అటవీశాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. అటవీశాఖ నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారికి మినహాయింపు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అడవులను కాపాడేందుకు బదిలీ అయిన సిబ్బందికి ఒక న్యాయం, ఇతర శాఖల్లో లూప్‌లైన్ పోస్టుల్లో చేరిన వారికి మరో న్యాయమా? అని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నిర్దిష్ట మినహాయింపుల వెనుక ఉన్న మర్మమేమిటనే చర్చ సాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

