హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : దేశ, విదేశాలకు చెందిన విలువైన రత్నాలు, డైమండ్స్‌తో పొదిగిన స్వచ్ఛమైన బంగారు ఆభరణాల డిజైన్లను పరిచయం చేసేందుకు ‘జెమ్‌స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్’ను ప్రారంభించినట్టు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు తెలుగు రాష్ర్టాల్లోని అన్ని షోరూమ్‌లలో ఈ ఫెస్టివల్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అత్యధిక నాణ్యత, స్వచ్ఛమైన ఆభరణాలు సరసమైన ధరల్లో లభిస్తాయని వెల్లడించారు. ప్రతి కొనుగోలుకు బైబ్యాక్ గ్యారంటీ ఇస్తున్నట్టు వివరించారు.