హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచాలనే ప్రతిపాదనలను వెనకి తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. బీ క్యాటగిరీ సీ ట్లను ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీచేయాలని, డొనేషన్లు తీసుకొనే కళాశాలల యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి బోర్డు కార్యాల యం ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. అ నంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బోర్డు చైర్మన్ బాలకిష్టారెడ్డికి అందజేశారు.
అనంతరం గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడారు. ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీలు ఫీజులు పెం చుతుంటే, ప్రభుత్వం మాత్రం రీయింబర్స్మెంట్ పెంచకుండా విద్యార్థుల కుటుంబాల ను అప్పుల్లోకి నెడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు , నేతలు కోతి విజయ్, చటారి దశరథ్, యశ్వంత్‌కుమార్, కాటం శివ, రమేశ్‌గౌడ్, హరిబా బు, జంగయ్య, మాజ్, నర్సింగ్, ప్రశాంత్, నా గరాజు, షేర్మ్రన్, పీవీగౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.