పటాన్చెరు రూరల్, జనవరి 23 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారు. శుక్రవారం గీతం విద్యాసంస్థ ప్రతినిధులు గిన్నిస్ రికార్డుల గురించి వివరించారు. 2016-20 బ్యాచ్లో గీతంలో చదివిన శివాలి తన తల్లితో కలిసి 4700 కుందేళ్లు, 3500 తాబేళ్లను ఓరిగామిలో చేసి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు. వీరి పేరున ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి.