హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ గోదాములలో పని చేస్తున్న తెలంగాణ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని తెలంగాణ సివిల్ సైప్లెయ్, జీసీసీ హమాలీ వర్స్ర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలుగా ఎంతోకాలంగా పనిచేస్తున్న ఇప్పటి వరకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సివిల్ సైప్లెయ్ హమాలీల మాదిరిగానే తమకు కూడా పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాలకు ఏ సహాయం అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ శరత్‌కు వినతి పత్రం అందచేశామని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వంగూరు రాములు, బుస్సా మొగిలి, బోగి సత్యం, సుబ్రహ్మణ్యం, కాటెబోయిన శ్రీను తదితరులు తెలిపారు.