హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : వాణిజ్య పన్నులశాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్(ఏసీటీవోలు), జీఎస్టీ విభాగంలోని డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హోదా కల్పించింది. ప్రభుత్వం జీవో-70ను సోమవారం జారీచేసింది.
దీంతో 20 ఏండ్ల ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.