హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవోగా గౌతమ్ పొట్రు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం సెర్ప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల గురించి డైరెక్టర్లు సీఈవోకు వివరించారు. ఇప్పటి వరకు భద్రాచలం ఐటీడీఏ పీవోగా పనిచేసిన గౌతమ్ పొట్రు ఇటీవలి బదిలీల్లో సెర్ప్ సీఈవోగా నియమితులయ్యారు.