Munugode by Poll Results | ఆ స్వామి వారి సాక్షిగా.. టీఆర్ఎస్కే పట్టం కట్టిన గట్టుప్పల్ ప్రజలు..
Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు
Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. గట్టుప్పల్ మండల పరిధిలోని మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. నేతన్నల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడ్డాయి. చేనేతకు మరణ శాసనం రాసిన మోదీకి నేతన్నలు గట్టిగా సమాధానం చెప్పారు.
ఉప ఎన్నికలో భాగంగా కొద్ది రోజుల క్రితం టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టుప్పల్ గురించి ఈ విధంగా మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గట్టుప్పల్ ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ నాడు సూచించారు. ఎందుకంటే ఈ గట్టునేమో మంచినీళ్లు ఇచ్చిన కేసీఆర్ పార్టీ ఉంది. మరి ఆ గట్టునేమో మనల్ని కన్నీళ్లు పెట్టిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నది. ఈ గట్టునేమో రైతుబంధు లాంటి కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టునేమో కృష్ణా జలాల్లో మన వాటా తేల్చకుండా సతాయిస్తున్న నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ గట్టునేమో రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టునేమో సిలిండర్ ధరను రూ. 1200 చేసిన మోదీ ఉన్నారు. మరి ఏ గట్టున ఉందాం.. ఎవర్నీ గెలిపించుకుందాం అని ఆలోచించాలి.
ముఖ్యంగా గట్టుప్పల్ నేతన్న ఆలోచించాలి. 5 శాతం జీఎస్టీ వేసి చేనేతకు మరణ శాసనం రాస్తున్న మోదీ ఒక వైపు ఉంటే, చేనేత మిత్ర, నేతన్నకు బీమా, నేతన్నకు చేయూత లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ ఈ గట్టున ఉన్నారు. అందుకే ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద నుంచే గట్టుప్పల్ అనే పేరు వచ్చింది. ఆ స్వామి వారి సాక్షిగా ఆలోచించండి. ఎవరు మనకు మిత్రులు. కార్పొరేట్ కమలమా..? గరీబోళ్ల గులాబీనా..? ఎవరు గెలిస్తే గట్టుప్పల్, మునుగోడు బాగయితది. మన గోడు ఎవరు వింటారనేది ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

