IAS Officers | రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే, మరో ముగ్గురు అధికారుల అదనపు బాధ్యతల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ కార్యదర్శిగా రఘునందర్‌రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎస్ హరీశ్‌కు, గనులశాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను గరిమా అగర్వాల్‌కు అప్పగించింది. గరిమా అగర్వాల్ ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. గరిమా అగర్వాల్ ఇంతకు ముందు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా సేవలు అందించారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన గరీమా అగర్వాల్ యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా రెండేళ్లు, కరీంనరగ్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా రెండేళ్లు పని చేశారు.