20 Years Of Happy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కెరీర్లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ‘హ్యాపీ’ ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
2006 జనవరి 27న విడుదలైన ఈ సినిమా రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకున్న వేళ, తన జర్నీలో ఇది అత్యంత ఆనందాన్ని ఇచ్చిన చిత్రమని బన్నీ గుర్తుచేసుకున్నాడు. అద్భుతమైన విజన్‌తో ఈ కథను తెరకెక్కించిన దర్శకుడు ఎ. కరుణాకరన్‌కు, తన సహ నటి జెనీలియాకు, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రాణం పోసిన యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సాంకేతిక నిపుణుల కృషిని ప్రశంసిస్తూనే, తన తండ్రి అల్లు అరవింద్ మరియు గీతా ఆర్ట్స్ సంస్థ అందించిన మద్దతును ఆయన కొనియాడారు. మలయాళంలో కూడా ఘనవిజయం సాధించి అక్కడ బన్నీకి బలమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించి పెట్టిన ఈ సినిమా జ్ఞాపకాలను అభిమానులు ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు.
20 years of #Happy. 🖤
One of the most enjoyable films of my journey.
Grateful to #AKarunakar garu for the beautiful vision.
My wonderful co-star dear @geneliad, the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride.@thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR— Allu Arjun (@alluarjun) January 27, 2026