సూర్యాపేట, జనవరి 27 : గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన ఉప సర్పంచుల సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు ముందుండాలన్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గిరిజన తండాల్లో ఉప సర్పంచుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, మున్యా నాయక్ తండా సర్పంచ్ సుశీల సాగర్ నాయక్, ఐలాపురం గ్రామ ఉప సర్పంచ్ అనిల్ నాయక్, బానోత్ నాగు నాయక్, జిల్లావ్యాప్త ఉప సర్పంచులు పాల్గొన్నారు.