Rythu Bandhu | రైతుబంధు ఇస్తే నాట్లేసేటోణ్ని.. ఇప్పుడు రైతుబంధు వేస్తరో, వేయరో తెలుస్తలేదు: రైతు నర్సయ్య
‘కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస్తలేదు. రైతు బంధు వస్తేనే వరినాటు వేస్తా సారు’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటకు చెందిన దళిత రైతు లింగాల నర్సయ్య ఆవేదన వెలిబుచ్చారు.
- కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు టైంకు వస్తుండే.. ఇప్పుడెట్లనో ఏమో..!
- గంగాధర మండల రైతు లింగాల నర్సయ్య ఆవేదన
Rythu Bandhu | గంగాధర, డిసెంబర్ 28: ‘కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస్తలేదు. రైతు బంధు వస్తేనే వరినాటు వేస్తా సారు’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటకు చెందిన దళిత రైతు లింగాల నర్సయ్య ఆవేదన వెలిబుచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో మధురానగర్ సమీపంలో మాజీ ఎంపీ వినోద్ తన వాహనాన్ని ఆపారు. వినోద్‌ను చూసిన దళిత రైతు నర్సయ్య దగ్గరికి వచ్చి తన వ్యవసాయ పొలం చూడాలని కోరాడు. నర్సయ్య కోరిక మేరకు పొలం వద్దకు వెళ్లిన వినోద్‌కుమార్.. ‘వ్యవసాయం ఎలా సాగుతున్నది’ అని అడిగారు.
‘వడ్ల పైసలతో పొలం దున్ని, విత్తనాలు తెచ్చి నారుపోసిన. ఇప్పుడు వరి నాటుకు వచ్చింది. నాటు వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. నారు ముదురుతున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు బంధు పైసలు వస్తాయని ఆశగా చూస్తున్నానని, రెండు రోజులకోసారి బ్యాంకుకు వెళ్లి ఖాతాలో డబ్బులు పడ్డయో లేదో చూసి వస్తున్నానని, ఇంతవరకు రైతుబంధు పైసలు పడలేదని వాపోయాడు. అందుకే నాటువేసేందుకు వెనుకడుగు వేస్తున్నానని చెప్పిన రైతు.. కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు రెండు పంటల పెట్టుబడికి రంది లేకుండెనని, నాటు వేసే సమయానికి రైతుబంధు పైసలు పడేటియని, కాం గ్రెస్ ప్రభుత్వంతో రైతుల బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని వివరించాడు. వినోద్ వెంట కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, నాయకులు సంపత్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

