హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) టీచర్స్ ఎలిజిబులిటీ క్వాలిఫికేషన్(టీఈక్యూ) ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడిగా ప్రొఫెసర్ టీ గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.
గంగాధర్ ప్రస్తుతం నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిస్తున్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా డాక్టర్ విజయ్ ఓజా వ్యవహరించనున్నారు. కమిటీలో మరో సభ్యుడిగా ప్రొఫెసర్ వివేక్ ఏ సావ్జీ నియమితులయ్యారు. ఈ కమిటీ మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది అర్హతలకు ఉన్న నిబంధనలను సవరించేందుకు సలహాలు ఇవ్వనున్నది. దీంతోపాటు టీఈక్యూ అప్లికేషన్లను ఎగ్జామిన్ చేయనున్నది.