నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
- పాస్‌పోర్టు కోసం వినియోగం
- ఏడుగురు నిందితుల అరెస్టు
వేములవాడ, జూలై 21 : పాస్‌పోర్టులు, నకిలీ టెన్త్ సర్టిఫికెట్లు తయారు చేసి అందిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీసులు పట్టుకొన్నారు. వేములవాడ డీఎస్పీ కే నాగేంద్రాచారి గురువారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన పాస్‌పోర్టు ఏజెంటు పోచంపల్లి దేవరాజు, ఆన్లైన్ కంప్యూటర్ సర్వీసెస్ నిర్వాహకుడు మహమ్మద్ ముజాహిద్ అలియాస్ మహమ్మద్ ముషాహెద్ పాషా కలిసి పాస్‌పోర్టుల కోసం అవసరమైన నకిలీ పదోతరగతి సర్టిఫికెట్లు సమకూరుస్తామని పలువురిని ఒప్పించారు. ఈ క్రమంలో పదిమంది వద ్దడబ్బులు తీసుకొని నకిలీ టెన్త్ సర్టిఫికెట్లను తయారు చేసి ఇవ్వగా, వీరంతా ఆ సర్టిఫికెట్లను ఉపయోగించి పాస్‌పోర్టులు పొందారు. నకిలీ టెన్త్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్టు స్పెషల్ బ్రాంచ్ ఎస్సై జీ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణ సీఐ వెంకటేశ్ నేతృత్వంలో దర్యాప్తు జరిపారు. పాస్‌పోర్టు ఏజెంటు పోచంపల్లి దేవరాజు, ఆన్లైన్ కంప్యూటర్ నిర్వాహకుడు మహమ్మద్ ముజాహిద్తోపాటు నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పాస్‌పోర్టులు పొందిన శాలిబండ్ల జోసఫ్‌రెడ్డి, మహహ్మద్ బాబూమియా, మహమ్మద్ చాంద్, ఎర్రం దేవేందర్, రెడ్డవేని చంద్రంను గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నకిలీ పదో తరగతి సర్టిఫికెట్లు, నాలుగు పాస్‌పోర్టులు, సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ల్యాప్‌టాప్, కంప్యూటర్, ప్రింటర్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. మిగితా ఐదుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. పాస్‌పోర్టులు పొంది పరారీలో ఉన్నవారు స్వదేశంలోనే ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు. గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనం ప్రాజెక్టుతో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

