హైదరాబాద్, జనవరి2 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ చట్టంలోని ఇద్దరు పిల్లల నిబంధనను వెంటనే రద్దు చేయాలని గిరిజన సొసైటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 4న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ మంది ఉన్నప్పటికీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు, చివరికి పాత నిబంధననే కొనసాగించటం సరికాదని తెలిపారు. చంద్రబాబు హయాంలో జనాభా నియంత్రణపై అవగాహన కోసం ఈ నిబంధన పెట్టారని, ప్రస్తుతం ఏపీలో ఆయన ఈ రూల్స్‌ను ఎత్తివేశారని పేర్కొన్నారు.